ప్రేమ పేరుతో మత మార్పిడులకు పాల్పడుతున్న ఘటనలపై మహారాష్ట్ర(Maharastra) సర్కారు దృష్టిపెట్టింది. ‘లవ్ జిహాద్’పై చట్టం తెచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కమిటీ వేసిన దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారు.. వివిధ రాష్ట్రాల్లోని బలవంతపు మత మార్పిడుల చట్టాలను పరిశీలించనుంది. మహారాష్ట్ర DGP సంజయ్ వర్మ కమిటీకి నేతృత్వం వహించనుండగా, అందులో మొత్తం ఏడుగురు ఉంటారు. అమల్లో ఉన్న చట్టాలు, వాటి అడ్డుకట్టకు గల న్యాయపరమైన అంశాలను కమిటీ పరిశీలన చేయనుంది. పూర్తి రిపోర్టును తయారు చేసి సర్కారుకు అందజేస్తుంది. ఈ రాష్ట్రానికే చెందిన శ్రద్ధా వాకర్ ను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాల 2022లో దారుణంగా ముక్కలు ముక్కలుగా చేసి చంపాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైతే, ‘లవ్ జిహాద్’ అంశం మరోసారి చర్చకు వచ్చింది. అయితే ఈ కమిటీని విపక్షాలు విమర్శించాయి.