ఛాంపియన్స్ ట్రోఫీ మరో మూడు రోజుల్లో ప్రారంభమవుతుండగా భారత జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ బుమ్రా(Bumrah) నెలన్నర నుంచి దూరమైతే.. ఇప్పుడు యశస్వి జైస్వాల్(Jaiswal) వంతు. గాయం కారణంగా ఈ యంగ్ ఓపెనర్ రంజీ సెమీస్ ఆడలేదు. ఎడమ కాలి చీలమండ గాయంతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాక్టీస్ లో నొప్పి వచ్చిన విషయాన్ని టీమ్ మేనేజ్మెంట్ కు తెలియజేశాడు. దీంతో అతణ్ని జట్టు నుంచి తప్పించి కోలుకునేందుకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీ(NCA)కి తరలించనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి జైస్వాల్ ను BCCI రిలీజ్ చేయడంతో విదర్భతో సెమీస్ కు ముంబయి రెడీ చేసింది. కానీ గాయంతో తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ స్టాండ్ బై జాబితాలో యశస్వి ఉన్నాడు. ఇతడి గాయంపై BCCI నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.