ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకగా భావిస్తున్న ‘మహాకుంభమేళా'(Mahakumbha Mela)కు.. ఇప్పటికే 55 కోట్ల మందికి పైగా విచ్చేశారు. ప్రయాగరాజ్ లోని త్రివేణీ సంగమానికి కోట్లాది మంది రావడంతో అక్కడి ఆదాయ మార్గాలపై అందరి దృష్టీ పడింది. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. వీటన్నింటికీ UP CM యోగి ఆదిత్యనాథ్ సమాధానమిచ్చారు. అమృత స్నానాలకు వచ్చే వారు కాశీ, అయోధ్య సహా దర్శనీయ స్థలాలకు వస్తున్నారన్నారు. ఈ వేడుకకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.7,500 కోట్లు ఖర్చు చేశాయని యోగి తెలిపారు. అదనంగా మరో రూ.1,500 కోట్లు కూడా వెచ్చిస్తున్నామన్నారు.
ప్రయాగరాజ్, కాశీ, అయోధ్య, చిత్రకూట్, గోరఖ్ పూర్, నైమిశారణ్యం వంటి పుణ్యక్షేత్రాల వద్ద వసతులు కల్పించారు. అయోధ్యకు ఏడాది కాలంలో కానుకలు, విరాళాల రూపంలో రూ.700 కోట్ల ఆదాయం వచ్చినట్లు యోగి తెలిపారు. నిన్నటి(ఫిబ్రవరి 17) వరకు 54.5 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే 45 రోజులపాటు సాగే ‘మహాకుంభమేళా’ ద్వారా UP సర్కారుకు 3 నుంచి 3.5 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని యువ పారిశ్రామికవేత్తలతో మాట్లాడిన సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ వివరించారు.