మహారాష్ట్ర(Maharstra)లో అధికారపక్ష పార్టీల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. CM దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ CM ఏక్నాథ్ షిండే మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. 20 మంది శివసేన MLAలకు సెక్యూరిటీ తొలగిస్తూ ఫడ్నవీస్ ఉత్తర్వులిచ్చారు. Y+ కేటగిరీ సెక్యూరిటీని తీసివేయడంతో ఇక ఒక కానిస్టేబుల్ మాత్రమే భద్రతగా ఉంటారు. మరో మిత్రపక్షమైన అజిత్ పవార్ NCP సహా BJP సభ్యులకు సైతం భద్రతను కుదించారు. మహాయుతి పార్టీల మధ్య కొద్ది రోజులుగా కోల్డ్ వార్ నడుస్తున్నది. పరిశ్రమల శాఖ సమావేశాన్ని శివసేనకు చెందిన ఉదయ్ సామంత్ నిర్వహించారు. అయితే ఈ మీటింగ్ ను జనవరిలోనే CM ఫడ్నవీస్ పూర్తి చేశారు.
2027 కుంభమేళాపై నాసిక్ మెట్రోపాలిటన్ సమావేశానికి రావాలన్న CM ఆహ్వానాన్ని డిప్యూటీ CM పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత అదే సమావేశాన్ని షిండే ప్రత్యేకంగా నిర్వహించారు. ఈమధ్యనే మెడికల్ ఎయిడ్ సెల్ ను ఏర్పాటుచేసి దానికి తన సహచరుణ్ని హెడ్ గా చేశారు షిండే. CM రిలీఫ్ ఫండ్ సెల్ స్థానంలో డిప్యూటీ CM ఇలా డిపార్ట్మెంట్ ను ప్రారంభించడం సంచలనమైంది. ఇలా వివిధ రకాలుగా వివాదం ఏర్పడ్డ వేళ.. ఇప్పుడు భద్రతను తగ్గించడంపై అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.