ఓపెనర్ బెన్ డకెట్ సూపర్ సెంచరీతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. ఆస్ట్రేలియా(Australia)తో లాహోర్లో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. మరో ఓపెనర్ సాల్ట్(10)తోపాటు మిగతావాళ్లు తొందరగా ఔటైనా డకెట్ స్పీడ్ ఆగలేదు. స్మిత్(15), జో రూట్(68), బ్రూక్(3), బట్లర్(23), లివింగ్ స్టోన్(14) పరుగులు చేశారు. రూట్ మినహా సహచరులంతా వెనుదిరుగుతున్నా డకెట్(165; 143 బంతుల్లో 17×4, 3×6) జోరు కొనసాగించాడు. 95 బాల్స్ లో సెంచరీ పూర్తిచేసిన అతడు 134 బంతుల్లో 150 దాటాడు. అటు ఇంగ్లండ్ స్కోరు కూడా 44 ఓవర్లలోనే 300కు చేరుకుంది. చివరకు 8 వికెట్లకు 351 పరుగుల భారీ స్కోరు చేసింది బట్లర్ సేన.