రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్ శక్తికాంతదాస్ కు మరోసారి కీలక పదవి దక్కింది. ఆయన్ను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి(Principal Secretary)-2గా కేంద్రం నియమించింది. రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల్లో పనిచేసిన దాస్.. RBI 25వ గవర్నర్ గా ఈ మధ్యనే పదవీకాలం పూర్తి చేసుకున్నారు. 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగానూ సేవలందించగా, PM ప్రిన్సిపల్ సెక్రటరీ వంటి కీలక విధుల్ని అప్పగించారు. సెక్రటరీ-1గా ప్రమోద్ కుమార్ మిశ్రా 2019 నుంచి మోదీ వద్ద పనిచేస్తుండగా, గతేడాది రెండోసారి నియామకమయ్యారు. ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, IMF, G20, బ్రిక్స్, సార్క్ సహా కీలక హోదాల్లో శక్తికాంత సేవలందించారు.