అది.. ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మ్యాచ్. లాహోర్ గడాఫీ స్టేడియంలో ఆటకు ముందు ఇరు జట్ల ప్లేయర్లు తమ జాతీయ గీతాల్ని(National Anthems) ఆలపించాలి. తొలుత ఇంగ్లండ్ గీతం పూర్తి కాగా.. నెక్స్ట్ ఆస్ట్రేలియా వంతు. కానీ అంతలోనే భారత జాతీయ గీతంలోని లైన్ వినిపించింది. ‘భారత భాగ్య విధాత’ అని ప్లే కావడంతో అంతా నిశ్శబ్దం(Silence)తో కూడిన ఆశ్చర్యం. దీనిపై ICC మీద పాక్ మండిపడింది. వివరణ ఇవ్వాలంటూ ICCకి PCB పాలకమండలి లెటర్ రాసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో జాతీయ గీతాన్ని ఆలపించేందుకు ఆయా దేశాలే బాధ్యులుగా ఉంటాయి. కానీ పాకిస్థాన్ లో భారత్ ఆడకున్నా మన జాతీయ గీతాన్ని ప్లే చేయడం వివాదానికి కారణమైంది. భారత్ రాకున్నా జాతీయ గీతం ఎలా వచ్చిందంటూ పాక్ ఇప్పటికీ తేరుకోలేకపోతోంది.