ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ తో తలపడుతున్న భారత్.. ముగ్గురు స్పిన్నర్లు(Spinners), ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగింది. మరో సీమర్ గా హార్దిక్ పాండ్య ఉంటాడు. సీమ్, స్పిన్ ఆల్ రౌండర్ల పరంగా చూస్తే పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. స్పెషలిస్టు స్పిన్నర్లయిన అక్షర్, జడేజా సహా కుల్దీప్ యాదవ్ సైతం జట్టులోకి వచ్చాడు. దుబాయిలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కోట్లాది మంది అభిమానులు ఈ దాయాదుల పోరు కోసం ఆత్రుతతో వేచి చూస్తున్నారు.