ఓవర్లో ఆరు బంతులకు బదులు ఎక్స్ ట్రాల రూపంలో మొత్తం 11 బాల్స్ వేయాల్సి వచ్చింది. అదీ అత్యంత కీలక పోరుగా భావించే దాయాదుల సమరంలో. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తొలి ఓవర్లోనే మహ్మద్ షమి 11 బంతులు(Balls) వేశాడు. ఇన్నింగ్స్ ను ప్రారంభించిన అతడు.. 5 వైడ్లు వేశాడు. 0, 1(w), 0, 1(w), 1(w), 0, 1, 0, 1(w), 1(w), 0 చొప్పున 11 బాల్స్ వేసి 6 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వైడ్ల రూపేణా పాక్ స్కోరు బోర్డులో 5 రన్స్ అప్పనంగా చేరాయి. తర్వాతి ఓవర్లో హర్షిత్ రాణా సైతం ఒక వైడ్ వేశాడు.