భారత్ తో మ్యాచ్ లో పాకిస్థాన్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 47 పరుగులకే రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది. జోరులో ఉన్న బాబర్ అజమ్(23) తొలుత ఔటయ్యాడు. హార్దిక్ పాండ్య వేసిన బాల్ ను ఆడి కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత మరో 6 పరుగులకే ఇంకో వికెట్ పడింది. ఈసారి అక్షర్ పటేల్ అద్భుత త్రో.. పాక్ ఓపెనర్ ను అనూహ్య రనౌట్ చేసింది. కుల్దీప్ విసిరిన బంతిని మిడాన్ కు ఆడిన ఇమామ్-ఉల్-హక్(10) సింగిల్ తీసేలోపే.. అక్షర్ సూపర్ త్రో వికెట్లను పడగొట్టింది. ఇలా 50కి చేరుకోకముందే ఓపెనర్లిద్దరినీ కోల్పోవడం పాకిస్థాన్ తోపాటు ఆ దేశ అభిమానులకు షాక్ ను మిగిల్చింది. దీనిపై కామెంటేటర్ వసీమ్ అక్రమ్… ‘సిల్లీ డిసిషన్ బై ఇమామ్-ఉల్-హక్’ అంటూ విమర్శించాడు.