దాయాదుల పోరులో పాకిస్థాన్ బ్యాటింగ్ నిదానంగా సాగింది. తొలి నుంచీ చివరి వరకు ప్రత్యర్థి బ్యాటర్లకు టీమ్ఇండియా బౌలర్లు కళ్లెం వేశారు. మూడో వికెట్ కు సౌద్ షకీల్(62), మహ్మద్ రిజ్వాన్(46) అందించిన 104 పరుగుల భాగస్వామ్యమే(Partnership) హయ్యెస్ట్. ఇమామ్(10), బాబర్(23), సల్మాన్(19), తయ్యబ్(4), అఫ్రిది(0) పరుగుల చొప్పున చేశారు. పాక్ ఇన్నింగ్స్ మొత్తం 5 రన్ రేట్ లోపే కొనసాగడం భారత బౌలర్ల పనితనాన్ని చాటింది. 25.3 ఓవర్లలో 100 మార్క్ చేరుకున్న పాక్.. 42.3 ఓవర్లలో 200 దాటింది. చివర్లో ఖుష్దిల్(38) స్పీడ్ పెంచడంతో మెరుగైన స్కోరు దిశగా సాగినా, క్రమంగా వికెట్లు కోల్పోవడంతో 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ మూడు, పాండ్య 2 వికెట్లు తీసుకున్నారు.