భారత్ చేతిలో ఘోరంగా ఓడిన పాకిస్థాన్ పై ఆ దేశ మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోశారు. టీమ్ మేనేజ్మెంట్ పై వసీమ్ అక్రమ్(Wasim Akram), షోయబ్ అక్తర్(Shoaib Akhtar) మండిపడ్డారు. ‘పాక్ క్రికెట్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. వాళ్ల గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్.. PCBకి బుర్ర, మతి లేవు.. మోడ్రన్ క్రికెట్లో ఐదుగురు బౌలర్లతోనే ఆడటం మూర్ఖత్వం..’ అన్నాడు షోయబ్. ‘మేం పురాతన క్రికెట్ కు అలవాటుపడ్డాం.. బెదురు లేని యువకులు టీంలోకి రావాలి.. ఒమన్, USA కన్నా అధ్వానంగా బౌలింగ్ తయారైంది.. 2026 టీ20 వరల్డ్ కప్ వరకన్నా మేల్కోవాలి..’ అని వసీమ్ గుర్తు చేశాడు. ‘హ్యాట్సాఫ్.. అతడో సూపర్ స్టార్.. ప్రస్తుత క్రికెట్లో 100 సెంచరీలు చేసే దమ్ముంది..’ అంటూ విరాట్ పై ప్రశంసలు కురిపించాడు అక్తర్.