ఇంటర్మీడియట్(Intermediate) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. వాటిని కళాశాలల లాగిన్ లలో అప్ లోడ్ చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. హాల్ టికెట్లలో తప్పులు ఉంటే ప్రిన్సిపల్స్ ని సంప్రదించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 5 నుంచి మొదలయ్యే పరీక్షలు 24 వరకు ఉండగా, తొమ్మిదిన్నర లక్షల మంది హాజరుకానున్నారు. అతి త్వరలోనే విద్యార్థుల మొబైల్ నంబర్లకు డౌన్లోడ్(Download) లింక్ లను పంపిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. వీటిల్లో పరీక్ష వివరాలు, విద్యార్థి సమాచారం, పరీక్ష కేంద్రం వంటి వివరాల్ని ఉంచారు. పరీక్ష కేంద్రాల సమాచారం కోసం వాటిపై క్యూఆర్ కోడ్ సైతం ప్రింట్ చేసింది. https://tgbie.cgg.gov.in లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు.