మార్చి(March) రాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం ఉండటంతో ఒంటి పూట బడులను నడపాలన్న వినతులు వస్తున్నాయి. పొద్దున తొమ్మిదింటికే బయటకు రాలేని పరిస్థితుల్లో ఒక్కపూట బడులు ఉండాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. అయితే మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సర్కారు సైతం దీనిపై దృష్టిపెట్టింది. పలు జిల్లాల్లో 34 నుంచి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత(Temparatures)లు నమోదవుతున్నాయి. రాబోయే వారంలో తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో మార్చి మొదటి వారం నుంచే ఒంటి పూట బడులు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాలున్నాయి. అయితే మార్చి మొదట్లోనేనా లేక మొదటి వారం తర్వతనా అన్నది తేలాల్సి ఉంది.