45 రోజుల పాటు సాగిన మహాకుంభమేళా పరిపూర్ణమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకలో 65 కోట్ల మందికి పైగా అమృత స్నానాలు(Holy Dip) ఆచరించారు. మహాశివరాత్రి నాడు సాయంత్రానికి 1.40 కోట్ల మంది రాగా, ప్రయాగరాజ్ త్రివేణీ సంగమానికి 2 కోట్ల మందికి పైగా వస్తున్నట్లు UP సర్కారు తెలిపింది. జనవరి 13న వేడుక మొదలైంది. మకర సంక్రాంతి(జనవరి 14), మౌనీ అమావాస్య(జనవరి 29) వసంత పంచమి(ఫిబ్రవరి 3), మాఘ పౌర్ణిమ(ఫిబ్రవరి 12), మహాశివరాత్రి(ఫిబ్రవరి 26) సందర్భాల్లో గంగ, యమున, సరస్వతి నదుల సంగమాన్ని భారీగా సందర్శించారు.
కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలతో మహాకుంభమేళా పూర్తవుతుంది. ఏడు శైవ అఖారాలకు సంబంధించి పేష్వై ఊరేగింపులో 10 వేల మందికి పైగా నాగ సాధువులు పాల్గొన్నారు. కాశీ రహదారుల్లో జెండాలు, త్రిశూలాలు చేతబూని పాటలు, నృత్యాలతో సందడి చేశారు. భక్తులపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించింది యోగి సర్కారు.