తెలుగు సినీ నటుడు, మాటల రచయిత(Writer) పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. YSRCPలో కీలక పాత్ర పోషించిన ఆయన.. అనుచిత కామెంట్స్ చేశారని APలో కేసు నమోదైంది. దీంతో అక్కడి పోలీసులు పోసానిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గంలోని మైహోమ్ భుజా అపార్ట్మెంట్లో ఉన్న అతడిని రాయచోటి పోలీసులు అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్ తరలిస్తున్నారు. రెండ్రోజుల క్రితం పోసానిపై కేసు నమోదైంది. సినీ ఇండస్ట్రీపై విమర్శలు చేశారన్నది కంప్లయింట్.