MLA కోటా MLCలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ లో మహామహులు టికెట్ కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి 29 నాటికి 5 స్థానాలు ఖాళీ అవుతాయి. ఈ నెల 3 నుంచి నామినేషన్లు మొదలవుతుండగా, అభ్యర్థుల(Candidates) ఎంపిక ఊపందుకుంది. రెడ్ల నుంచి మాజీ మంత్రులు జానారెడ్డి, చిన్నారెడ్డి.. SCల నుంచి అద్దంకి దయాకర్, సంపత్ కుమార్.. మైనార్టీల నుంచి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్.. మహిళల నుంచి సునీతారావు, మాజీ మంత్రి పుష్పలీలతోపాటు AICC ప్రతినిధులు, DCC అధ్యక్షులు పోటీ పడుతున్నారు.
లెక్కలివిగో…
ప్రస్తుతానికి కాంగ్రెస్ 65, BRS 38, BJP 8, MIM 7 మంది శాసనసభ్యులతో ఉండగా, CPIకి ఒకరున్నారు. మొత్తం 119కి గాను ఒక్కో స్థానానికి 21 మంది MLAలు అవసరమవుతారు. ఈ లెక్కన హస్తం పార్టీకి 3, గులాబీ పార్టీకి 2 దక్కాలి. అయితే 10 మంది MLAలు కాంగ్రెస్ లో చేరడంతో BRS అంచనాలు మారిపోయాయి. అలా కాంగ్రెస్ కు 4, BRS కు 1 దక్కే ఛాన్స్ ఉంది. అయితే గులాబీ పార్టీ రెండింట్లో పోటీ చేస్తుందా, ఒక్కదానికే పరిమితమవుతుందా అన్నది తేలాల్సి ఉంది.