ప్రారంభమైన రెండు గంటల వరకు నిదానంగా సాగిన MLC ఎన్నికల పోలింగ్ క్రమంగా పుంజుకుంటోంది. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల(Graduates) స్థానానికి మధ్యాహ్నం 12 వరకు 19.20% ఉంటే, రెండింటికి అది 40.61 శాతానికి చేరింది. ఇక అదే స్థానంలోని ఉపాధ్యాయ MLCకి పన్నెండింటి దాకా 33.98% ఉంటే, మధ్యాహ్నం 2 గంటల వరకు అది 63.49 శాతమైంది. పట్టభద్రుల కంటే ఉపాధ్యాయులే ఓటింగ్ కు పెద్దయెత్తున పోలింగ్ సెంటర్లకు చేరుకుంటున్నారు. 77.95%తో పెద్దపల్లి, 77.58%తో మెదక్, 75.33%తో ఆదిలాబాద్, 74.70%తో జయశంకర్ భూపాలపల్లి, 74.47 శాతంతో కుమురం భీమ్ ఆసిఫాబాద్ టాప్-5లో నిలిచాయి.