బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందిన ఘటన పాకిస్థాన్ లో జరిగింది. ఖైబర్ పక్తుంఖ్వా(Khyber Pakhtunkhwa) ప్రావిన్స్ లోని అకోరా ఖటక్ జిల్లాలో బాంబు పేలింది. దారుల్ ఉల్-లూమ్ హక్కానియా మదర్సా వద్ద జరిగిన ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మదర్సా హాలులోనే దుండగులు పేలుడుకు పాల్పడ్డారు. JUI-S చీఫ్ మౌలానా హమీదుల్ హక్ హక్కానీ లక్ష్యంగా బ్లాస్ట్ జరిగింది.