మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ముంబయి ఇండియన్స్ చిత్తుగా ఓడిపోయింది. ఆ జట్టు విధించిన టార్గెట్ ను ఢిల్లీ అలవోకగా ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 9 వికెట్లకు 123 పరుగులు చేసింది. మాథ్యూస్(22), హర్మన్ ప్రీత్(22) టాప్ స్కోరర్లు. మామూలు టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్(DC).. మెగ్ లానింగ్(60 నాటౌట్; 49 బంతుల్లో 9×4), షెఫాలి వర్మ(43; 28 బంతుల్లో 4×4, 3×6) దంచికొట్టడంతో భారీ విజయం దక్కించుకుంది. కేవలం వికెట్ మాత్రమే నష్టపోయి 9 వికెట్ల తేడాతో ఘనమైన గెలుపును అందుకుంది.