సినిమా షోలపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. బెనిఫిట్(Benefit), ప్రీమియర్, స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది. అయితే 16 ఏళ్ల లోపు పిల్లల విషయంలో సడలింపునిచ్చింది. వారిని అన్ని షోలకు పర్మిషన్ ఇస్తూ జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఘటనలతో.. తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపును సర్కారు ఆపేసింది. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విడుదల సమయంలో రేట్ల పెంపునకు పర్మిషన్ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. అయితే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం అర్థరాత్రి 1:30 నుంచి పొద్దున 8:40 గంటల మధ్య ఎలాంటి షోలకు పర్మిషన్ ఇవ్వొద్దని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.