MLC తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ పై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంది. క్షమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందున ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు గాను ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలంటూ అదే నెల 5న షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ ఆయన్నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు DAC(డిసిప్లినరీ యాక్షన్ కమిటీ) ఛైర్మన్ జి.చిన్నారెడ్డి పేరిట ఆదేశాలు వెలువడ్డాయి. కులగణన సర్వేపై BC జనాభా లెక్కల విషయంలో పార్టీ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. ఒక వర్గానికి చెందిన నాయకులే వెనుకబడిన కులాలను తగ్గించి చూపారని.. BC సభలో ఆరోపణలు చేశారు. పార్టీ దీనిపై వివరణ కోరింది.