ఇంగ్లండ్(England) ఆటతీరు మారలేదు. దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న వన్డేలో 37 పరుగులకే 3 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఫిల్ సాల్ట్(8), బెన్ డకెట్(24), జేమీ స్మిత్(0) ముగ్గుర్నీ మార్కో యాన్సెన్ ఔట్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-Bలో ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్ చేరింది. ఆస్ట్రేలియా 4, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ మూడేసి పాయింట్లతో ఉన్నాయి. ఈ మ్యాచులో గెలిస్తే సౌతాఫ్రికా సెమీస్ చేరుతుంది. ఒకవేళ ఓడితే అఫ్గాన్ తో సమంగా ఉంటుంది. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకం కానుండగా, అందులో సౌతాఫ్రికా(2.140)నే టాప్ లో ఉంది. అఫ్గాన్(-0.990) మైనస్ లో ఉంది. ఇందులో ఇంగ్లండ్ గెలిచినా లాభం ఉండదు.