శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(SLBC) సొరంగం ప్రమాదంలో కీలక అప్డేట్ వచ్చింది. మనుషులు ఆనవాళ్లను అత్యాధునిక పరికరాల(Equipment)తో గుర్తించామని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఆనవాళ్లున్న ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయని, TBM(టన్నెల్ బోరింగ్ మిషిన్)ను కట్ చేసే పనులు నడుస్తున్నాయన్నారు. 5-8 మీటర్ల మట్టిదిబ్బలో నలుగురి ఆనవాళ్లు స్కానింగ్ లో కనిపించగా, మరో నలుగురు TBM కింద ఉన్నట్లుగా నిర్ధారించారు. నిన్న(ఫిబ్రవరి 28)నే మెత్తని భాగాల్ని గుర్తించగా, అవి మానవదేహాలా అన్నది అనుమానంగా మారింది. ప్రమాదం జరిగిన ఎనిమిదో రోజు సైతం NDRF, సింగరేణి సహా 11 సంస్థలు సహాయ చర్యల్లో ఉన్నాయి.