30కే మూడు వికెట్లు.. రోహిత్(15), గిల్(2), కోహ్లి(11) ఔట్.. ఇలాంటి పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్(79), అక్షర్ పటేల్(42) జట్టును ఆదుకున్నారు. న్యూజిలాండ్ మ్యాచ్ లో క్రీజులో కుదురుకున్నాక(Settled) బౌండరీలు రాబట్టారు. ఈ ఇద్దరితోపాటు రాహుల్(23), జడేజా(16) ఔటవడంతో తక్కువ స్కోరుకే టీమ్ఇండియా పరిమితమైంది. బౌలింగ్ కన్నా ఫీల్డింగ్ తోనే ఆకట్టుకున్న కివీస్ ప్లేయర్లు.. పోటీపడుతూ మరీ పరుగుల్ని ఆపారు. చివర్లో హార్దిక్ పాండ్య(45) మెరుపులు మెరిపించడంతో మెరుగైన స్కోరుకు చేరుకుంది. ఓవర్లు ముగిసే సరికి భారత్… 9 వికెట్లకు 249 స్కోరు చేసింది.