ఎన్నికలకు ముందు ఎంతగా ప్రచారం చేసినా.. చదువుకున్న వారే తడబాటు పడుతున్నారు. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల(Graduates) MLC స్థానానికి భారీగా చెల్లని ఓట్లు పడ్డాయి. దీంతో ఓట్ల లెక్కింపులో అయోమయం ఏర్పడింది. సుమారు 40 వేల ఓట్లు చెల్లనివిగా ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. మొత్తం 2 లక్షల 50 వేల ఓట్లు పోలైతే.. అందులో 40 వేల పైచిలుకు చెల్లని ఓట్లు ఉన్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.