నియోజకవర్గాల పునర్విభజన(Delimitation)పై కేంద్రం మీద విమర్శలు చేస్తున్న తమిళనాడు CM స్టాలిన్.. పలువురు ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తమతో కలిసి పోరాటానికి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ, AP, కర్ణాటక, కేరళ, పంజాబ్, బిహార్, పశ్చిమబెంగాల్ CMలకు లేఖలు పంపించారు. చెన్నైలో ఈనెల 22న నిర్వహించే JAC భేటీకి రావాలని కోరారు. అధికార పార్టీలతోపాటు ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన ప్రతిపక్షాలకు సైతం ఆయన ఆహ్వానం పంపించారు. ప్రజాస్వామ్యానికి అన్యాయం జరుగుతోందని, ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రం నిర్ణయాన్ని అంగీకరించొద్దని కోరారు.