భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ విజేత(Winner) ఎవరన్న దానిపై చర్చ ఊపందుకుంది. ఒకవైపు జోరుగా బెట్టింగ్ లు సాగుతుంటే.. రేపటి విజేతను తేల్చేశాయి AI చాట్ బాట్స్. గూగుల్ జెమిని, చాట్ జీపీటీ, డీప్ సీక్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు తమ అంచనాల్ని ప్రకటించాయి.
గూగుల్ జెమిని…: ఫైనల్ చాలా టఫ్. ఇరుజట్లు స్ట్రాంగ్ గా ఉన్నా భారత్ కే అవకాశాలెక్కువ. విధ్వంసక బ్యాటింగ్ లైనప్.. రోహిత్, కోహ్లి, రాహుల్ వంటి మ్యాచ్ విన్నర్లున్నారు. బౌలర్లు క్రమశిక్షణ కంటిన్యూ చేస్తే ట్రోఫీ రోహిత్ సేనదే.
ఓపెన్AI చాట్GPT…: ముచ్చటగా మూడోసారి భారత్ కప్ అందుకుంటుంది. కోహ్లి, అయ్యర్ ఫామ్ కలిసొస్తుంది. లీగ్ మ్యాచ్ లో కివీస్ ఓడగా, గత పదేళ్లలో 5 ఈవెంట్లలోనే ఫైనల్ చేరింది. విలియమ్సన్, రచిన్ పైనే ఆధారపడుతోంది.
డీప్ సీక్…: రోహిత్, కోహ్లి సహా బ్యాటింగ్ లైనప్.. భిన్నమైన బౌలింగ్ తో భారత్ గెలవచ్చు. ICC ఈవెంట్లలో భారత్ డామినేషన్ గత కొన్నేళ్లుగా బాగుంది. ఒకరిద్దరిపైనే న్యూజిలాండ్ భారమంతా.
మైక్రోసాఫ్ట్ కోపైలట్…: ఫైనల్లో ఇండియానే ఫేవరేట్. స్ట్రాంగ్ లైనప్, ఒక్క మ్యాచూ ఓడని చరిత్ర.. కోహ్లి, గిల్ వంటి బ్యాటర్లు, షమి దళంతో కూడిన బ్యాలెన్స్ డ్ స్క్వాడ్ భారత్ బలం. ఆసియా ఖండం పరిస్థితులు కివీస్ కష్టమే. గతంలోనూ ఆ జట్టు ఇబ్బంది పడింది.