గూఢచర్య ఆరోపణలతో పట్టుబడ్డ భారత నౌకాదళ అధికారి కుల్ భూషణ్ జాదవ్ అరెస్టులో హస్తమున్న ఉగ్రవాది ముఫ్తీ షా మిర్ హతమయ్యాడు. జమైత్ ఉలేమా-ఇ-ఇస్లామ్ సభ్యుడైన ముఫ్తీని బలూచిస్థాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మానవ అక్రమ రవాణా(Human Trafficking) చేసే ఇతణ్ని.. మసీదులో రాత్రి ప్రార్థనలు చేసి వస్తుండగా మట్టుబెట్టారు. 2016 మార్చి 3న ఇరాన్-పాక్ సరిహద్దుల్లో జాదవ్ ను పట్టుకున్నారు. జాదవ్ ను తొలుత జైష్ అల్-అదీ చీఫ్ ముల్లా ఒమర్ ఇరానీ పట్టుకోగా, ఆ గ్రూప్ నుంచి ISI ఎత్తుకెళ్లింది. నేవీలో రిటైరై ఇరాన్ చాబహార్లో బిజినెస్ చేస్తున్న జాదవ్.. పాక్ కు దొరకడంతో అక్కడి మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించింది. దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించగా.. అతని విడుదలకు భారత్ తీవ్రంగా పోరాడుతోంది.