లాల్ దర్వాజ బోనాల(Bonalu) పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్(hyderabad) లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున బలిగంప కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ కుటుంబ సభ్యులతో మహాభిషేకం నిర్వహించి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. రాష్టప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాసయాదవ్.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అధికార పార్టీ BRS, విపక్ష కాంగ్రెస్ కు చెందిన ప్రముఖ లీడర్లు… అమ్మవారిని దర్శించుకున్నారు.
బోనమెత్తిన గవర్నర్
అమ్మవారికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బోనం, ఒడిబియ్యం సమర్పించారు. రాజ్ భవన్ లోని నల్లపోచమ్మ ఆలయంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నానంటూ రాష్ట్ర ప్రజలందరికీ విషెష్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిలుపు రాలేదని, అందుకే రాజ్ భవన్ లో ప్రోగ్రాం చేస్తున్నామన్నారు.