శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(SLBC) టన్నెల్ నుంచి ఒక మృతదేహం బయటకు తీశారు. 15 రోజులుగా కష్టాలు పడ్డ సిబ్బంది.. అధునాతన పరికరాల(Equipments)తో మృతదేహాల్ని గుర్తించగలిగారు. ఇప్పుడు బయటపడ్డ మృతదేహం.. టన్నెల్ బోరింగ్ మిషిన్(TBM) ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ దిగా అనుమానిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు గుర్తించిన తర్వాతే ప్రకటన వెలువడనుంది.