శ్రీచైతన్య విద్యాలయాల(Institutions)పై ఆదాయపన్ను శాఖ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా గల బ్రాంచీల్లో నిన్నట్నుంచి సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నై, బెంగళూరు, ముంబయి నగరాల్లో శ్రీచైతన్య కార్యకలాపాలు నడుస్తుండగా.. లావాదేవీల(Transactions)పై IT అధికారులు దృష్టిపెట్టారు. హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని కార్పొరేట్ ఆఫీసులోనూ పెద్దయెత్తున సోదాలు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం, రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజులు, చెల్లింపులపై IT శాఖ నజర్ పెట్టింది. కేంద్ర బలగాల బందోబస్తు మధ్య ఫైళ్లు పరిశీలిస్తుండగా.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.