మారిషస్(Mauritius)లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ కు వినూత్న కానుక అందించారు. అలాంటిలాంటి బహుమతి కాకుండా… కోట్లాదిమంది ఆచరించిన అపూర్వ కానుక అది. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన త్రివేణీ సంగమ గంగాజలాన్ని.. బహూకరించారు. రెండ్రోజుల టూర్ కోసం మారిషస్ వెళ్లిన ప్రధాని.. గంగాజలంతోపాటు తన ఇష్టమైన ఆహారం ‘బిహార్ మఖానా’ను ప్రెసిడెంట్ కు అందించారు. అక్కడి ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాంతోనూ భేటీ అయ్యారు. 2015 తర్వాత మోదీకి ఇదే తొలి మారిషస్ పర్యటన.