
ప్రత్యేక మిషన్ కింద చిరుత పులుల(cheetah) సంతతిని పెంచేందుకు చేపట్టిన ప్రోగ్రాంకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎనిమిది చిరుతలు మరణించినట్లు కేంద్ర పర్యావరణ శాఖ ప్రకటించడం.. వాటి వృద్ధిపై అనుమానాలు కలిగిస్తోంది. మధ్యప్రదేశ్(madhya pradesh)లోని కునో నేషనల్ పార్కులో గత నాలుగు నెలల కాలంలో 8 చిరుతలు మృత్యువాత పడ్డాయి. ఇందులో మూడు పసికూనలు ఉన్నాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(NTCA)తో జాయింట్ గా ప్రాథమిక దర్యాప్తు జరిపిన పర్యావరణ శాఖ.. 5 పెద్ద చిరుతల మృతిలో స్పెషల్ రీజన్స్(reasons) లేవని, సహజసిద్ధంగా(natural causes)గానే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది. మెడ సంబంధిత అనారోగ్యమే అయి ఉండొచ్చని తేల్చింది.
70 ఏళ్ల తర్వాత చిరుతలు దేశంలోకి వచ్చాయని, ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా మారాలంటే ఇలాంటివి జరుగుతుంటాయని తెలిపింది. అయితే ఇది ఏడాది పాటు సాగే ప్రోగ్రాం అని, దీనిపై ఇప్పుడే ఓ అంచనాకు రావడం కష్టమని ఎన్విరాన్ మెంట్ టీమ్ చెబుతోంది. ప్రాజెక్ట్ చీతా కింద నబీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి తీసుకువచ్చి కునో పార్కులో వదిలారు. ప్రధాని స్పెషల్ ఇంట్రస్ట్ తో ఇక్కడకు తరలించిన చీతాల మనుగడపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
కునో నేషనల్ పార్కులో వదిలే ముందు వాటిని క్వారంటైన్ చేశారు. ఇక్కడి వెదర్ కు అలవాటు పడ్డాయని భావించిన తర్వాతే అడవిలో వదిలారు. ప్రపంచ లెక్కల్ని చూస్తే ఆఫ్రికన్ దేశాల నుంచి సప్లయ్ చేసిన చిరుతల్లో ప్రారంభ దశలోనే 50 శాతం మరణాలు ఉంటాయని ఆ టీమ్ తెలిపింది. అనారోగ్య కారణాలు లేదా వేటలో తలెత్తిన దుష్పరిణామాల వల్ల మరణాలు సంభవించి ఉండొచ్చని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఒక కూన సహా మొత్తం 6 చిరుతలు హెల్దీగా ఉన్నాయని పర్యావరణ శాఖ వెల్లడించింది.