అమృత్ సర్ స్వర్ణ దేవాలయం(Golden Temple)పై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు, ఇద్దరు సేవకులకు గాయాలయ్యాయి. సిక్కుల కొత్త సంవత్సరం నానక్ షాహీ సందర్భంగా శ్రీ గురు రాందాస్ వేడుకలు జరుగుతున్నాయి. వివిధ దేశాల నుంచి భక్తులు రాగా.. ఉన్నట్టుండి ఓ వ్యక్తి ఇనుప రాడ్డుతో దాడికి దిగినట్లు శిరోమణి గురుద్వార్ ప్రబంధక్ కమిటీ(SGPC) తెలిపింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వల్లహాలోని హాస్పిటల్ తరలించారు. మొహాలి, భటిండా, పాటియాలాకు చెందిన భక్తులు గాయపడ్డారు. CCTV కెమెరాల ఆధారంగా ఇద్దర్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హరియాణాలోని షాహిద్ పూర్ కు చెందిన జుల్ఫాన్ ప్రధాన నిందితుడని పోలీస్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ భల్లార్ తెలిపారు.