కొండగట్టు అంజన్న దయతో ప్రాణాలతో బయటపడ్డానని జనసేన అధిపతి(Chief) పవన్ కల్యాణ్ అన్నారు. కరెంట్ షాక్ తగిలినా అంజన్న తనకు పునర్జన్మనిచ్చాడని తలచుకున్నారు. ఒక్కడిగా, ఒంటరిగానే పోరాటం ప్రారంభించానని.. ఎక్కడా ఆరాటపడలేదని గుర్తు చేశారు. గుండె ధైర్యమే కవచంగా 2014లో జనసేనను స్థాపించామన్నారు. అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అంటూ విసిరిన ఛాలెంజ్ ను బద్ధలు కొట్టామన్నారు. 100 శాతం స్ట్రైక్ రేట్ తో ఘనవిజయం సాధించి NDA కూటమి సర్కారును నిలబెట్టామని వివరించారు.https://justpostnews.com