BJP ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలనంగా మాట్లాడారు. కొంతమంది పార్టీని వదిలిపోతే BJPదే అధికారమన్నారు. అసదుద్దీన్ ఒవైసీ పవిత్ర రంజాన్ మాసంలోనూ విషం కక్కుతున్నారని, ఆయన మాటల్ని ముస్లింలే నమ్మడం లేదన్నారు. ‘భయపడేవాళ్లు పాకిస్థాన్ వెళ్లిపోయారు.. మేం కొట్లాడేవాళ్లం.. తెలంగాణలో కమలం పార్టీ అధికారంలోకి వస్తే ఫస్ట్ పారిపోయేది అసదుద్దీనే.. మతకల్లోలాలు జరగొద్దనే హోలీ నాడు ఇళ్లల్లో నమాజ్ చేసుకోవాలని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.. దీన్ని కూడా తప్పుబట్టే ఆయనకు మానసిక చికిత్స అందించాలి.. రేవంత్ గారూ మీ కొత్త ఫ్రెండ్ కు ట్రీట్మెంట్ అందించేలా చూడండి..’ అంటూ వీడియోలో రాజాసింగ్ మాట్లాడారు.