గణితశాస్త్రం(Mathematics)లో పరిశోధనకు గాను అసిస్టెంట్ ప్రొఫెసర్ వనజ గోష్టికి గౌరవ డాక్టరేట్ లభించింది. ‘ఎఫెక్ట్స్ ఆఫ్ బౌండరీ స్లిప్ అండ్ వేరియెబుల్ ఫిస్కల్ ప్రాపర్టీస్’ అనే అంశంపై ఆమెకు PhD లభించింది. ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాలోని భారతీయ ఇంజినీరింగ్, సైన్స్ & టెక్నాలజీ ఇన్నొవేషన్ యూనివర్సిటీ.. ఆమెకు డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది. హైదరాబాద్ గీతాంజలి కళాశాల గణిత శాస్త్ర ఆచార్యులు డా.జి.శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆమె పరిశోధన సాగించారు. ఎల్.బి.నగర్ రాక్ హిల్స్ కాలనీకి చెందిన వనజ ప్రస్తుతం.. శ్రేయాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ కళాశాలలో పనిచేస్తున్నారు.