రేపు జరగబోయే NDA మీటింగ్ దృష్ట్యా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర రీతిలో స్పందించారు. మీటింగ్ కోసం దిల్లీకి చేరుకున్న ఆయన… ఈ అవకాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానంటూ మాట్లాడారు. ’18 నాటి సమావేశం కోసం BJP సీనియర్ నేతలు నన్ను ఆహ్వానించారు.. ఈ అవకాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పొత్తులపై ఇందులో చర్చించే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపైనా ప్రస్తావన ఉంటుందని, వీటిపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు రేపటి మీటింగ్ ను వేదికగా చేసుకుంటామని’ పవన్ వివరించారు. మరోవైపు NDA విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన విధానాలను చర్చిస్తామన్నారు.
వారాహి యాత్రలో భాగంగా నియోజకవర్గాలు చుట్టివస్తూ ప్రజల్ని కలుస్తున్న పవన్ కల్యాణ్… YSRCP ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి క్రూషియల్ టైమ్ లో NDA నుంచి ఇన్విటేషన్ రావడంతో పవన్ లో సంతోషం కనిపిస్తోంది. BJPతో జరిపే చర్చలు AP ఎలక్షన్లలో కీలక పాత్ర పోషిస్తాయన్న భావనతో ఉన్నారు. జగన్ అండ్ కో టీమ్ కు అడ్డుకట్ట వేయాలంటే పొత్తులు కూడా కలిసివస్తాయని భావిస్తున్న పవన్ కు NDA నుంచి పిలుపు రావడంతో దిల్లీకి చేరుకున్నారు.