
BJPని ఎదుర్కొనే టార్గెట్ లో భాగంగా విపక్షాలకు చెందిన లీడర్లంతా బెంగళూరులో భేటీ అయ్యారు. ప్రధాన పార్టీ కాంగ్రెస్ నుంచి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు సోనియా, రాహుల్ అటెండ్ అయ్యారు. అక్కడకు చేరుకున్న అగ్రనేతలకు కర్ణాటక CM సిద్ధరామయ్య, డిప్యూటీ CM D.K.శివకుమార్ స్వాగతం పలికారు. రానున్న ఎలక్షన్లలో అనుసరించే వ్యూహాలపై చర్చించేందుకు వీలుగా 26 పార్టీలతో కూడిన అలయెన్స్ ఈ మీటింగ్ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఒకసారి బిహార్ రాజధాని పట్నాలో సమావేశం కాగా… ఇప్పుడు బెంగళూరులో రెండోసారి లీడర్లంతా భేటీ అవుతున్నారు. మొత్తం ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొంటున్నారు.
TMC అధినేత్రి, బెంగాల్ CM మమతా బెనర్జీ.. తమిళనాడు CM M.K.స్టాలిన్, బిహార్ CM నితీశ్ కుమార్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పంజాబ్ CM భగవంత్ మాన్ తోపాటు CPM జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి తదితర టాప్ లీడర్లు హాజరయ్యారు.