BJP అధ్యక్షుల ఎంపిక కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. జాతీయ అధ్యక్షుడితోపాటు రాష్ట్రాలకు చీఫ్(Presidents)ల్ని నియమించాల్సి ఉంది. ఉగాది నూతన సంవత్సరంలో పేర్లను ప్రకటించే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి పార్టీ కౌన్సిల్ భేటీలు ఏప్రిల్ మూడో వారంలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఆలోపే జాతీయ అధ్యక్షుణ్ని ప్రకటించి, కౌన్సిల్లో ఆమోద ముద్ర వేయాలి. ముందునుంచీ పార్టీలో ఉన్నవారికే అప్పగిస్తారా, లేక కొత్తవారికి ప్రాధాన్యముంటుందా అన్నది తేలాలి. నేషనల్ ప్రెసిడెంట్ విషయంలో ఇంకో ఆలోచన లేకపోగా, రాష్ట్రాల అధ్యక్షుల విషయంలోనే చర్చ సాగుతోంది. పార్టీ, సంఘ్ మధ్య సమన్వయం చేసుకునేలా ఉంటేనే ఎక్కువ మార్కులు పడతాయన్న చర్చ జోరందుకుంది.
రాష్ట్రాల ఎన్నికలే…!
రాబోయే ఐదేళ్లలో పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2029 సార్వత్రిక ఎన్నికలపై BJP దృష్టిసారించింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా టైమ్ ఉన్నా, పంజాబ్, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఎలక్షన్లలో సత్తా చూపేలా సెలక్షన్ ఉండాలన్నది లక్ష్యం. పార్టీని సమర్థంగా నడిపే వ్యక్తి కోసం ఇప్పటికే BJP, RSS విస్తృత సంప్రదింపులు జరుపుతున్నాయి. అయితే మార్చి చివరి వారంలోపు నిర్ణయం వెలువడనుంది. జె.పి.నడ్డా పదవీకాలం 2023 జనవరితో ముగిసినా, లోక్ సభ ఎన్నికల దృష్ట్యా పొడిగించారు. ఆ తర్వాత నడ్డా కేంద్ర మంత్రి అయినా, మహారాష్ట్ర ఎన్నికల వల్ల అధ్యక్షుడి ఎంపిక మరోసారి వాయిదా పడింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, UP, MP, హరియాణా, ఒడిశా రాష్ట్రాలకు అధ్యక్షుల్ని ప్రకటించాల్సి ఉంది.
దక్షిణాదిలో పట్టుండేనా…!
దక్షిణాదిలో పట్టు సాధించేందుకు శ్రమిస్తున్నా లాభం లేకుండా పోతోంది. రాబోయే మూడేళ్లలో కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఎన్నికలుంటాయి. ఈసారి దక్షిణాది నుంచి జాతీయ అధ్యక్ష రేసులో ఉంటారన్న ప్రచారం మొన్నటివరకు బాగా జరిగింది. కానీ అందుకు అర్హులైన నేతల సంఖ్య సౌత్ లో చాలా తక్కువ. ఉత్తరాది నుంచి మాత్రం ఎక్కువమంది పోటీలో ఉన్నారు. దక్షిణాదితోపాటు చాలా రాష్ట్రాలకు అధ్యక్షుల్ని ప్రకటించాల్సి ఉండగా, అధిష్ఠానం ఎంపిక ఎలా ఉంటుందన్నది పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
1 thought on “కమలదళం అధ్యక్ష పదవులపై కసరత్తు… BJP Presidents Selection”