తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న హరితహారం(haritha haaram) కార్యక్రమంతో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగిందని ప్రభుత్వం(government) తెలిపింది. ఈ తొమ్మిదేళ్లలో 273 కోట్ల మొక్కలు నాటినట్లు ప్రకటించింది. హరితహారం ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలో అటవీ ప్రాంతం విస్తరించిందని ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో తెలపడంతో… దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అడిషనల్ గా 7.70 శాతం అటవీ విస్తీర్ణం పెరిగిందని హరితహారం అమలు, పర్యావరణం ఫలితాల వెల్లడి సందర్భంగా వివరించింది.
రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో 2015-16లో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు 273 కోట్ల మొక్కలు నాటగా.. రూ.700 కోట్లతో 179 అర్బన్ ఫారెస్టు పార్కులు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో నర్సరీతోపాటు పల్లె ప్రకృతి వనాలను డెవలప్ చేశారు. బడ్జెట్ లో 10 శాతం హరితవనానికి కేటాయించడంతో ఈ ఘనత దక్కినట్లయింది.