
దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి(NITI) ఆయోగ్(aayog) రూపొందించిన నేషనల్ పావర్టీ ఇండెక్స్ ద్వారా వెల్లడైంది. ఒడిశా, రాజస్థాన్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లో పేదరికం అత్యంత స్పీడ్ గా తగ్గుతోందని తెలిపింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(2019-21) వివరాల ఆధారంగా ఈ రిపోర్ట్ తయారు చేశారు. ఎడ్యుకేషన్, హెల్త్ తోపాటు జీవన ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ మూడు అంశాల్లో పోషకాహారం, శిశుమరణాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, బ్యాంక్ అకౌంట్స్ వంటి 12 అంశాలను లెక్కలోకి తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా పేదల పర్సంటేజ్ 2015-16లో 24.85గా ఉంటే.. 2019-21 నాటికి 14.96 శాతానికి తగ్గినట్లు రిపోర్ట్ తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 32.59 శాతం నుంచి 19.28 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 8.65 శాతం నుంచి 5.27 శాతానికి తగ్గింది. మొత్తంగా పేదరిక తీవ్రత 47 నుంచి 44 శాతానికి తగ్గినట్లు స్పష్టం చేసింది. శానిటైజేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, పోషకాహారం, వంట గ్యాస్ వంటి సౌకర్యాలను సర్కారు డెవలప్ చేయడంతో ఈ మార్పు సాధ్యమైందని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది.