ప్రపంచ అతిపెద్ద విమానాశ్రయాల్లో(Airport) ఒకటైన లండన్ హీత్రూ ఎయిర్ పోర్టు మూసివేయాల్సి వచ్చింది. నగర పశ్చిమప్రాంతంలో సబ్ స్టేషన్ అగ్నిప్రమాదానికి గురైంది. కరెంటు లేకపోవడంతో రాడార్లు పనిచేయక ఎయిర్ పోర్టును మూసివేసి అందర్నీ తరలించారు. చాలా విమానాలను అట్నుంచి అటే మళ్లించారు. ప్రపంచ అత్యుత్తమ ఎయిర్ పోర్ట్ ర్యాంకింగ్స్-2024లో హీత్రూది నాలుగో స్థానం. ఏటా 5.10 కోట్ల మంది ఇక్కణ్నుంచి సీట్లు బుక్ చేసుకుంటారు. సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఎంత టైమ్ పడుతుందో చెప్పలేమని బ్రిటన్ సర్కారు అంటోంది.