జమ్మూకశ్మీర్(Jammu Kashmir) ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అక్కడ సినిమా హాళ్లు కూడా ఫుల్ గా కనిపిస్తున్నాయని తెలిపారు. రాజ్యసభలో మాట్లాడిన షా.. ఉగ్రదాడులు బాగా తగ్గాయని, ఈ దశాబ్ద కాలం(Decade)లో కశ్మీర్ కు రూ.12 వేల కోట్ల పెటుబడులు వచ్చాయన్నారు. ఒకే దేశంలో రెండు సమాంతర ప్రభుత్వాలు నడిచే వ్యవస్థకు కాలం చెల్లిందని, గత కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. కేంద్ర హోంశాఖకు ఎన్నో బాధ్యతలున్నాయని.. రాష్ట్రాల సెక్యూరిటీ, ఉగ్రవాదం, సీమాంతర తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల పర్యవేక్షణ కీలకమన్నారు.