రెవెన్యూ(Revenue) శాఖలో కొత్త పోస్టులు మంజూరయ్యాయి. 10,954 గ్రామస్థాయి అధికారుల(Village Level Officers) పోస్టులు మంజూరు చేశారు. మాజీ VROలు, VRAల నుంచి ఆప్షన్లు తీసుకుని నియామకాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇటీవలే కేబినెట్ సమావేశంలో వీటి భర్తీకి ఆమోదం లభించింది. ఆర్థిక శాఖ అనుమతి రావడంతో త్వరలోనే ఈ నియామకాలు చేపట్టనున్నారు.