తమిళనాడు BJP అధ్యక్షుడు అన్నామలైపై కర్ణాటక డిప్యూటీ CM శివకుమార్ అనుచిత కామెంట్స్ చేశారు. డీలిమిటేషన్ పై స్టాలిన్ నిర్వహించిన అఖిలపక్ష భేటీకి శివకుమార్ హాజరయ్యారు. ఆ సమయంలో నల్ల బ్యాడ్జీలతో అన్నామలై నిరసన తెలపడంతో DK మండిపడ్డారు. ‘అన్నామలై పూర్ మ్యాన్.. ఆయన IPS ఆఫీసర్ గా మా రాష్ట్రంలోనూ పనిచేశారు.. ఆయన బలమేంటో మాకు తెలుసు.. అతని పని అతణ్ని చేసుకోనివ్వండి.. BJP ఆందోళనల్ని స్వాగతిస్తున్నా.. నన్ను తిహార్ జైలుకు పంపినా భయపడను..’ అంటూ మాట్లాడారు. దీనికి అన్నామలై రివర్స్ కౌంటరిచ్చారు. ‘అవును.. నేను పోలీస్ ఆఫీసర్ గా కర్ణాటక ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశా.. ఆ విషయాన్ని గుర్తుంచుకున్నందుకు శివకుమార్ కు ధన్యావాదాలు..’ అంటూ రిప్లై ఇచ్చారు.