సమాచారం(Data) చోరీ కింద భారత టెకీ ఖతార్ లో అరెస్టయ్యారు. గుజరాత్ వడోదర(Vadodara)కు చెందిన అమిత్ గుప్తా పదేళ్లుగా అక్కడే ఉంటున్నారు. టెక్ మహీంద్రా ఉద్యోగి అమిత్.. జనవరి 1న పట్టుబడ్డారు. అరెస్టు చేసి దర్యాప్తు చేస్తుండగా, ఆ అభియోగాలు నిరాధారమైనవని అక్కడివారు అంటున్నారు. తమ కుమారుణ్ని విడిపించేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని అతడి తల్లిదండ్రులు కోరుతున్నారు. కేసుపై అక్కడి భారత ఎంబసీ దృష్టిపెట్టింది. గుప్తా తల్లిదండ్రులు నెల క్రితమే ఖతార్ వెళ్లడంతో వారిని కలవలేదని BJP MP హేమంగ్ జోషి అన్నారు. 2022 తర్వాత ఆ దేశంలో భారతీయులపై కేసులు పెట్టడం ఇది రెండోసారి. 8 మంది నేవీ అధికారులు 2022లో పట్టుబడగా, అక్కడి కోర్టు 2023లో మరణశిక్ష విధించింది. కానీ కేంద్రం రాయబారంతో ఖతార్ ఎమిర్.. 2024లో క్షమాభిక్ష పెట్టారు.