కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వంపై కేంద్రానికి 4 వారాల గడువిచ్చింది న్యాయస్థానం. కర్ణాటక వాసి శిశిర్ పిటిషన్ పై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ లో విచారణ జరిగింది. బ్రిటన్ ప్రభుత్వం నుంచి రాహుల్ రహస్య ఇ-మెయిళ్లు సంపాదించానన్న పిటిషనర్.. ఇప్పటికే CBI విచారణ కోరారు. భారత్ లో ద్వంద్వ(Dual) పౌరసత్వం చెల్లదని వాదించారు. మరో దేశ పౌరసత్వం ఉంటే భారత్ పౌరసత్వం రద్దవుతుందని తెలిపారు. దీనిపై స్పందన తెలపాలంటూ గత నవంబరులోనే జస్టిస్ రాజన్ రాయ్, జస్టిస్ ఓం ప్రకాశ్ శుక్లా బెంచ్ ఆదేశించింది. అప్పుడు 3 వారాల గడువిచ్చినా వివరణ అందలేదు. తాజాగా మరోసారి కేంద్రానికి 4 వారాల గడువు ఇచ్చింది. ఈ అంశాన్ని తొలుత లేవనెత్తిన వ్యక్తి సుబ్రమణ్య స్వామి. 2015లోనే ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసినా అది అక్కడితోనే ఆగిపోయింది.