శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(SLBC) టన్నెల్ నుంచి మరో మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటన జరిగి ఇవాళ్టికి 30 రోజులైంది. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్(TBM) వద్ద వ్యక్తి ఆనవాళ్లు కనిపించాయి. పూర్తిగా కుళ్లిపోయిన పరిస్థితుల్లో దుర్వాసన వచ్చింది. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.